పులకించిన గోశాల..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrపులకించిన గోశాల..!
– మట్టి ఎడ్లు, గోపూజలతో శోభ
– గోసేవకులను సన్మానించిన సేవా సమతి
– తరలివచ్చిన నేతలు, గోభక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని గోశాలలో భక్తి పారవశ్యంతో పులకరించింది. గోశాలలో మట్టి ఎడ్ల అమావాస్య, గోపూజలతో శోభ సంతరించుకుంది. శుక్రవారం గోశాల సేవా సమితి, గోసేవకుల ఆధ్వర్యంలో మట్టి ఎడ్ల అమావాస్య ఉత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం గోసేవకులు పట్లోళ్ల ప్రియాంక రెడ్డి, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి దంపతులు గోపూజలు నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు గోసేవకులు కోటం రేణుక, కోటం శివప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో గోపూజలు నిర్వ హించారు.

ఈ ఉత్సవాలకు తాండూరు పట్టణానికి చెందిన నేతలు, గోసేవకులు తరలివచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, సునితా సంపత్, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు హాజరై మట్టి ఎడ్లను దర్శించుకున్నారు. అనంతరం గోవులను కూడా దర్శించుకున్నారు. దీంతో గోశాలలో మట్టి ఎడ్ల అమావాస్య శోభ సంతరించుకుంది. గోశాలలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.

మరోవైపు గోశాలలో గోవులకు సేవ చేస్తున్న గోసేవకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు సాయిపూర్ బాల్ రెడ్డి, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, వినోద్ జైన్. లింగదలి రవికుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం,  గోశాల ప్రధాన కార్యదర్శి కొట్రిక కిరణ్ కుమార్, సభ్యులు గోపాల్ భాగ్రే , సుబ్బారావు, విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఆర్టీసీ డిపో మేనేజర్ సమత, నాయకులు గద్దె శ్రీనివాస చారి, భవనల్ల హనుమయ్య, జుంటుపల్లి అరవింద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనురాధ రవికుమార్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, గోభక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

ప్రయాణికులకు మెరుగైన సేవలు