ప్రయాణికులకు మెరుగైన సేవలు

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrప్రయాణికులకు మెరుగైన సేవలు
– ఆర్టీసీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
– ఉమ్మడి రంగరెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత
– తాండూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రీజీనల్ మేనేజర్(ఆర్ఎం) శ్రీలత అన్నారు. గురువారం ఆమె తాండూరు డీపోను సందర్శించారు. డీపోలోని గ్యారేజీ, బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు బాగా పనిచేస్తున్నారని ఇంకా బాగా పనిచేయాలని సూచించారు.

డ్రైవర్లు కండక్టర్లతో ఆమె స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డీపో పరిధిలో రోజూ ఎన్ని కిలోమీటర్లు తిప్పుతున్నారు, ఎంత కలెక్షన్ సమకూరుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాండూరు డిపోలో కిలోమీటర్లను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నారని అడగగా రోడ్లు బాగా లేకపోవడం వల్ల సమయం వృధా, ఆలస్యం ఎక్కువగా అవుతున్నందున కొన్ని సందర్భాల్లోనే కిలోమీటర్లు క్యాన్సిల్ చేయడం జరుగుతుందని సిబ్బంది ఆమెకు వివరించారు.

మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగినా… డ్రైవర్లు కండక్టర్లు, సమన్వయంతో చక్కగా పనిచేస్తున్నారని, ఇలాగే ముందుకు సాగాలని సూచించారు. అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీపో మేనేజర్ సమత రెడ్డి, సీఐ నిర్మల, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

లయన్స్ క్లబ్ గొల్డెన్‌ జూబ్లిలో నవతరం..!