ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిమిలినరీ పరీక్షలకు వేళాయే..!
– తేదిలను ప్రకటించిన రిక్రూట్‌మెంట్ బొర్డు
– హల్ టిక్కెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: నిరుద్యోగులకు పోలీసుశాఖలో ఉద్యొగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిమిలినరీ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ మేరకు రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఎస్‌ఐ పోస్టులకు 2.45లక్షల మంది అభ్యర్థులు, కానిస్టేబుల్ పోస్టులకు 6.50లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 17,291 పోస్టుల్ని భర్తీ చేయనున్నది. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆగస్టు 7న ఉదయం 7గంటల నుంచి ఎస్సై, ఆగస్టు 21న ఉదం 10 గంటల నుంచి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్ www.tslprb.inలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మరోవైపు ఎస్‌ఐ పోస్టులకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు, కానిస్టేబుల్ పోస్టులకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేయనున్నది.



