తిరిగి వచ్చిన ప్రేమజంట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తిరిగి వచ్చిన ప్రేమజంట..!
– పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు
– వేధింపుల ఘటనలో ట్విస్ట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిపోయిన ప్రేమజంట కథలో ట్విస్ట్ ఏర్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్ళిపోయిన ప్రేమికులు తిరిగొచ్చారు. పెళ్లి చేసుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ సంఘటన చర్చనీయాచంగా మారింది. తాండూరు మండలోని బెల్కటూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు హైదారాబాద్ లో ఉంటున్నారు.

 

గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. దీంతో యువతీ తరపు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గ్రామంలో యువకుడి తల్లి దండ్రులపై వేధింపులు చేశారని బాధితులు మీడియా ఎదుట ఆరోపించారు. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది. అయితే పారిపోయిన ప్రేమజంట గ్రామానికి తిరిగి వచ్చారు.

 

ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చి కరణ్ కోట్ పోలిసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు కూడ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఈ జంట ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారనీ, ఇద్దరు మెజర్లు అని తెలుస్తుంది.

 

ఇదికూడా చదవండి…

మెంతిలో ఆరోగ్యం మెండు