జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి
– కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీయూడబ్ల్యూజే ఐజేయూ విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీయూడ్ల్యూజే ఐజేయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, అక్రిటేషన్ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి కోరారు. మంగళవారం హైదరాబాద్ లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శ్రీనివాస్ చారి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులలో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇళ్లులేని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులకు దాడులు చేస్తే పీడీ యాక్టు ద్వారా చర్యలు తీసుకునేలా చూడాలని, ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు అందజేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. ఇందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాస్ చారి తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఆర్టీసీ డీఎం సమత బదిలీ