వృత్తి నెపుణ్యంతో అభివృద్ధి చెందాలి
– ముస్లిం వెల్ఫేర్ సేవలు అభినందనీయం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వృత్తి నైపుణ్య శిక్షణతో మహిళలు, యవతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. పట్టణంలోని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్ తదితర వృత్తి నైపుణ్య రంగాలలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, మెమెంటోల ప్రధాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ శిక్షణ పొందిన మహిళలకు వాటిని ప్రధానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని ముస్లిం వెల్ఫేర్ సేవలను కొనియాడారు. అదేవిధంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు, మహిళలు, యువత కోసం కుల మతాలకు అతీతంగా సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఖలీలుల్లా షరీఫ్, ఖయ్యూం పాష ఖురేషీ, ముక్రముద్దీన్, ప్రధాన కార్యదర్శి ఖాలేద్ సైఫుల్లా, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ సలీం, మహమ్మద్ సాజిద్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ యూనుస్, కోశాధికారి యూనుస్, ఇమ్రాన్ ఖాన్, మోసిన్ ఖాన్, ఉపాధ్యాయులు అస్రా భేగం, మదియా భేగం, కౌన్సిలర్ సల్మా సుల్తానా, ఆఫ్రీన్ జువేరియా, అన్వర్ ఖాన్, తెలంగాణ రెసిడెన్షియల్’, స్కూల్ ప్రిన్సిపల్ ఫాతిమా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

