కాలనీ రోడ్డు బాగు చేయించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాలనీ రోడ్డు బాగు చేయించండి..!
– ఎమ్మెల్యేకు సాయిపూర్ కాలనీ వాసుల విజ్ఞప్తి
– స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, దర్శిని ప్రతినిధి : మా కాలనీలో రోడ్డు బాగుచేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పట్టణంలోని సాయిపూర్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కాలనీ వాసులు కలిశారు. సాయిపూర్ లోని న్యూ నలంద స్కూల్ సమీపంలోని రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యిందని తెలిపారు. కురుస్తున్న వర్షాలకు రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి నడవలేని స్థితికి వచ్చిందని తెలిపారు.

ఉదయం, సాయంత్రం స్కూల్ విద్యార్థులతో పాటు మార్గంలో వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి త్వరలోనే నిధులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, కాలనీ వాసులు వీరేశం గౌడ్, ఆనంద్ గౌడ్, మల్లేశం, కిష్టప్ప, చేతన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇవ్వాలి