ఆత్మగౌరవం పెంచే బతుకమ్మ సారే
– బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆడ పడుచుల ఆత్మగౌరవానికి పెంచేందుకు తెలంగాణ సర్కారు బతుకమ్మ సారేలను అందిస్తుందని తాండూరు బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు, 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ శనివారం తన వార్డులో మహిళలను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడాది మహిళలకు, యువతులకు బతుకమ్మ చీరలను అందిస్తుందన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలన్నారు.
ఇది కూడ చదవండి..

