రేపు తాండూరుకు స్పీకర్, మంత్రుల రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు స్పీకర్, మంత్రుల రాక
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు రేపు స్పీకర్, మంత్రులు రానున్నారు. నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పర్యటన కొనసాగుతుంది. తాండూరు పట్టణంలో గొల్ల చెరువు వద్ద బాక్స్ డ్రైన్, చెన్‌ గెష్‌ పూర్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్‌కు శంకుస్థాపన, గ్రీన్‌ సీటి సమీపంలో మహబూబ్‌ నగర్‌ – చించొల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన, బ్రిడ్జి పనులకు శంకుస్థాపన, అమృత్ 2.0కింద నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మార్కెట్ కమిటి పాలక వర్గ ప్రమాణ స్వీకారం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పరిశీలన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అదేవిధంగా తాండూరు మండలం జినుగుర్తిలో విద్యుత్ సబ్‌ స్టేషన్‌ ప్రారంభం, చంద్రవంచలో కొత్త సబ్ స్టేషన్, పెద్దేముల్ మండలం కందనెల్లి, యాలాల మండలం జుంటుపల్లిలో ఏర్పాటు చేసే సబ్‌ స్టేషన్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. బషీరాబాద్‌ మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారం, కరణ్‌ కోట్ – బషీరాబాద్‌ డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తాండూరులో జరుగుతున్న స్పీకర్, మంత్రుల పర్యటనను జయప్రదం చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞఫ్తి చేశారు.

ఇదికూడా చదవండి…

తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి