జయశంకర్ సార్ ఆశయాలకు కృషి చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

జయశంకర్ సార్ ఆశయాలకు కృషి చేయాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
– జయంతిలో నివాళులు అర్పించిన ఉద్యమ కారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు అనుగుణంగా కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సమక్షంలో ఉద్యమ కారులు జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఉద్యమకారులకు అండగా ఉంటానని ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తానని, ఉద్యమకారులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని అన్నారు. ఉద్యమ కారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పథకాల్లో ఉద్యమకాలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు భాను, జిలాని, గోవిందరావు, శ్రీనివాస్ రెడ్డి, వాజిద్, ఫిరోజ్ ఖాన్, కేశవులు, అబేద్ చావుస్, మోయిస్, సాయి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తెలంగాణ దార్శనీకుడు ఫ్రో.జయశంకర్..!