కుట్టు మిషన్ ఫ్రీ..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కుట్టు మిషన్ ఫ్రీ..!
– కొనుగోలుకు రూ. 15వేలు
– రూ. 1లక్ష రుణం దరఖాస్తుకు అవకాశం
– దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కోసం ఎన్నో ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణిస్తున్నారు. ఇదే తరహాలో టైలరింగ్‌లో రాణించే వారికి కేంద్ర ప్రభుత్వం అద్బుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. ఈ పథకంలో భాగంగా.. కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ.15,000 పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. అలాగే ఓ వారం డిజిటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున మనీ ఇస్తుంది. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగివుండాలి.

అర్హులు ఎవరంటే…?
ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. ఇప్పటికే కుట్టుపని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్‌గా పనిచేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.

1లక్ష నుంచి 2 లక్షల దాకా రుణం..
కుట్టుమిషన్ కొనుక్కున్న తర్వాత.. కేంద్రం 1 లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో చెల్లించవచ్చు. రుణం చెల్లించాక మరో 2 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. దాన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా కేంద్రం కుట్టుమిషన కొనుక్కునేవారు.. షాపు పెట్టుకునేందుకు ఈ రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే.. రుణాలకు అప్లై చేసుకునే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్రమే చెల్లిస్తుంది. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.

ఇలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక https://pmvishwakarma.gov.in లోకి వెళ్లాలి. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కుదరదు అనుకుంటే మీ దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి, చేయించుకోవచ్చు. మీరు పైన చెప్పుకున్న పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి. మీ దరఖాస్తు అప్లై చేశాక, మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.

ఇదికూడా చదవండి…

మలబద్దకంపై చూ..మంత్రం..!