ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం..!
– స్వచ్ఛదనం, పచ్చదనం అందరి బాధ్యత
– మొక్కలు, పరిసరాల పరిశుభ్రంతో మనిషి మనుగడ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– రాజీవ్ కాలనీలో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరం భాగస్వాములై ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని రాజీవ్ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలతో కలిసి పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రంతో రోగాల నుంచి దూరంగా ఉండొచ్చన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనంతో ఆరోగ్యసమాజాన్ని నిర్మించుకుందామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, బంటు మల్లప్ప, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

