పట్టణాభివృద్ధికి ప్రత్యేక దృష్టి..!
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 10వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ సాయిపూర్ లోని 10వ వార్డులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలుతో కలిసి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి ప్రాధన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా వార్డులకు నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు.
వార్డుల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్లు, కల్వర్టులు వంటి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎక్కడైనా అభివృద్ధి పనులను గుర్తించి ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తమ వార్డుకు నిధులు కేటాయించి సీసీ రోడ్డును శంకుస్థాపన చేయడం పట్ల పట్లోళ్ల రత్నమాల నర్సింలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మహిళ నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

