ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ..!
– బస్సులో పోగొట్టుకున్న సెల్ తిరిగి అప్పగింత
– అభినందించిన డీపో అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను తిరిగి అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలు తన మోబైల్ ఫోన్ ను బస్సులో మరిచిపోయింది. గమనించి తీసుకున్న బస్ కండక్టర్ శంకర్ వివరాలను తెలసుకున్నారు. తాండూరు ఆర్టీసీ బస్టాండ్ లో డీపో కంట్రోలర్ నర్సింలు, బీవీఎన్ ఎస్ రెడ్డి, అధికారుల సమక్షంలో కండక్టర్ శంకర్ ఫోన్ పోగొట్టుకన్న మహిళ ప్రయాణికురాలుకు తిరిగి ఫోన్ అప్పగించారు. కండక్టర్ శంకర్ చాటుకున్న నిజాయితిని అధికారులు అభినందించారు. మరోవైపు ప్రయాణికురాలు కండక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి..

జాతీయ సమగ్రతను చాటుదాం..!