బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– పైలెట్ రోహిత్ రెడ్డిని సన్మానించిన రాకేష్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల బీఆర్ఎస్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లారు. మండలంలోని చెంగోల్ గ్రామానికి చెందిన యువనేత రాకేష్ గౌడ్ తాండూరు పట్టణం సాయిపూర్ సమీపంలో నూతన ఇంటిని నిర్మించుకుని ఇటీవలే గృహా ప్రవేశ వేడుకకూడా జరుపుకున్నారు. గురువారం ఈ సందర్భంగా తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రాకేష్ గౌడ్ నివాసాన్ని సందర్శించారు. సొంత ఇంటిలో చేరిన సందర్భంగా రోహిత్ రెడ్డి రాకేష్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం రాకేష్ గౌడ్ రోహిత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజప్ప గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నేతలు నర్సిరెడ్డి, పటేల్ ఉమాశంకర్, లక్ష్మీనారాయణపూర్ నర్సిరెడ్డి తదితరలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు