వార్డు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

తాండూరు వికారాబాద్

వార్డు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
– సాయిపూర్‌లో సీసీ డ్రైన్ ప‌నుల‌కు శంకుస్థాప‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని 9వ వార్డులో వార్డు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు పేర్కొన్నారు. గురువారం వార్డులో 14 ఆర్థిక సంఘం నిధులు రూ. 5ల‌క్ష‌లతో చేప‌ట్టే సీసీ డ్రైన్ నిర్మాణ ప‌నుల‌కు వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు తాండూరు మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్, ఆర్డీఓ అశోక్ కుమార్‌తో క‌లిసి శంకుస్థాపన చేశారు.
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించి ద‌శ‌వారిగా వాటి ప‌రిష్కారానికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌లకు ఇబ్బందుల‌కు లేకుండా మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు శ్ర‌ద్ద వ‌హిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమoలో మాజీ కౌన్సిలర్ సావిత్రి గారు, డీఈ స‌దానందం, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.