సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ
– ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన రాములు అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత పొందుతున్నారు. స్థానిక నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఎమ్మెల్యే సహాకారంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.50 లక్షలు మంజూరు చేసింది.
మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదల కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

