సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం..!
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– తాండూరులో లబ్దిదారులకు ఎల్‌ఓసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు వరం లాంటిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పలువరు లబ్దిదారులకు రూ. 5,35,000/- లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్ఓసీలను అందజేశారు. పెద్దేముల్ మండలం ఆత్కూర్ గ్రామానికి చెందిన వి. బ్రహ్మచారి 56వేలు, నర్సాపూర్‌ జి మల్లమ్మకు రూ. 60వేలు, మంబాపూర్ కు చెందిన అశోక్‌కు రూ. 60వేలు, బషీరాబాద్ కు చెందిన ఏ రాములుకు రూ. 60వేలు, రెడ్డి ఘనాపూర్ సుశీలమ్మకు రూ. 60వేలు, యలాల్ మండల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వై. ప్రమీలకు రూ. 19వేలు, అన్నాసాగర్ గ్రామానికి చెందిన కే. రత్నమ్మకు రూ. 29500లు, అగ్గనూరు గ్రామానికి చెందిన గోపాల్‌కు రూ. 30500లు, నర్సమ్మకు రూ. 40వేలు, తాండూరు పట్టణం ఇంద్రానగర్ కు చెందిన బాబా గౌడ్‌కు రూ. 60వేలు, కమలాకర్‌కు రూ. 60వేలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్‌ పథకం వరంలాంటిందన్నారు. ఈ పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి గారు, తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ బోయ రవి రాజు, హరిసూదన్ రెడ్డి, బిడ్కర్ రఘు, అగ్గనూరు బీమప్ప, పెద్దేముల్ మండల నాయకులు నారాయణ రెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, సంకేత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పాత తాండూరులో కూలిన ఇళ్లు