రండి.. మట్టి వినాయకులు తీసుకోండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రండి.. మట్టి వినాయకులు తీసుకోండి..!
– తాండూరులో ఉచితంగా పంపిణీకి ఏర్పాట్లు
– ఆర్యవైశ్య యువజన, వాసవీ మహిళ సంఘం నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి వినాయకునేల పూజిద్దాం అనే నిర్ణయాన్ని అందరు పాటించాలని తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళ సంఘం ముందడుగు వేసింది. రండి మట్టి వినాయకులను తీసుకోండి అంటూ ఉచితంగా విగ్రహాల పంపిణీనికి సిద్దమైంది. ప్రతి యేడాది వినాయక చవితికి మట్టి వినాయకులను పంపిణీ చేసే ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ యేడాది నిర్వహించే వినాయక చవితికి మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

6వ తేది శుక్రవారం తాండూరు పట్టణంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపీణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తర్లపల్లి భానుకుమార్, కార్యదర్శి చీకటిమర్ల పునీత్ కుమార్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, కార్యదర్శురాలు మంకాల స్వప్న రాఘవేందర్ లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి సౌజన్యంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని గాంధీ చౌరస్తాలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు పాల్గొని మట్టి వినాయకులను తీసుకోవాలని సూచించారు. కాలుష్య నియంత్రణ కోసం మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి