వినాయకుని కృప అందరికి సిద్దించాలి
– డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్
– దస్తగిరిపేట్ వినాయకుని వద్ద పూజలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వినాయకుని కృప అందరికి సిద్దించాలని డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రతిష్టించిన వినాయకున్ని దర్శించుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు.

ఈ సందర్బంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ముందుపూజల అధినాయకుడు వినాయకున్ని కొలిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు. వినాయకుడి కృప అందరికి సిద్దించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శాంతు, గ్రామ పెద్దలు, వినాయక ఉత్సవ సమితి సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

