రూ.1 లక్ష 15 వేలకు లడ్డూ వేలం

తాండూరు రాజకీయం వికారాబాద్

రూ.1 లక్ష 15 వేలకు లడ్డూ వేలం
– మండలంలోని అంతారంలో వేలంకు స్పందన
– లడ్డూలను సొంతం చేసుకున్న భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో వినాయక లడ్డూల వేలంకు స్పందన లభించింది. మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డును అంతారం గ్రామానికి చెందిన బి. అజయ్ బద్రి అనే భక్తుడు రూ. 1లక్ష 15వేలకు దక్కించుకున్నారు. గ్రామ పెద్దలు బీజే శ్రీనివాస్ సమితి సభ్యులు ఆయనను సన్మానించి లడ్డూను అందజేశారు.

అదేవిధంగా అదేగ్రామంలో ప్రతిష్టించిన స్వస్తిక్ వినాయక ఉత్సవ సమితి లడ్డూను గ్రామానికి చెందిన కుమ్మరి పాండు అనే వ్యక్తి రూ.1లక్ష 100లకు సొంతం చేసుకున్నారు. ఉత్సవ సమితి సభ్యులు ఆయనకు సన్మానించి లడ్డును అందజేశారు. అనంతరం స్వస్తిక్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని శ్రీశైలంలో నిమజ్జనం చేసేందుకు తరలించారు. మరోవైపు శ్రీ వేంకటేశ్వర స్వామి వద్ద ప్రతిష్టించిన వినాయకున్ని ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రిపోర్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి