లడ్డూ వేలం రికార్డు బ్రేక్..!
– తాండూరులో రూ. 4లక్షల 11వేల, 111లకు వేలం
– రికార్డు ధరకు దక్కించుకున్న మంచాల ఫ్యామిలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో వినాయకుని లడ్డూ వేలం రికార్డు బ్రేక్ అయ్యింది. బుధవారం నిర్వహించిన లడ్డూల వేలంలో అత్యధిక ధరకు వేలం జరిగిన రూ. 3లక్షల 61వేలను ఓ కుటుంబం బ్రేక్ చేసింది. పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూను బంటారం అభిలాష్ రూ. 3లక్షల 61 వేలకు దక్కించుకోగా పట్టణంలోని పటేల్ భగీచా గణేష్ లడ్డూను మంచాల కుటుంబ సభ్యులు దానికంటే అధిక ధరకు వేలం పాడి దక్కించుకున్నారు. మంచాల భాను రేఖ, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు రూ. 4లక్షల 11వేల 111లకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.
ఇదికూడా చదవండి..

