పార్టీకి, పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్టీకి, పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి, పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులుగా నియామకమైన బాతుల నాగరాజు బుధవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అధ్యక్ష పదవిని అప్పగించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గజమాలతో సత్కరించి.. శాలువాతో సన్మానించి.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. అర్హులకు అమలయ్యేలా చూడాలని సూచించారు. పార్టీకి, పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని అన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయకత్వంలో పార్టీ నాయకుల సహాకారంతో పార్టీ పటిష్టతకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మమత నాగరాజు, నాయకులు లొంక నర్సింలు, బాతుల వెంకటయ్య, భీం శంకర్ తదితరులు ఉన్నారు.

మాజీ సర్పంచే.. ముద్దాయి..!