బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యే సోదరులను సన్మానించిన సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని సమాజం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతం చేయించారు. దీంతో తాండూరు బ్రాహ్మణ సమాజం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడూత సమాజం అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. అవసరమైన నిధులు కేటాయించి భవనం పూర్తయ్యేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం సభ్యులు తాండూరు ఎమ్మెల్యే సోదరుడు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని కూడ కలిసి సన్మానించారు.

ఇదికూడా చదవండి..

మా జీతాలు ఇవ్వండి..!