కబ్జా యత్నానికి కళ్లెం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కబ్జా యత్నానికి కళ్లెం..!
– కబ్కం వీరేందర్‌ స్థలానికి వీడిన చెర
– వ్యాపారులందరి సమక్షంలో స్వాదీనం
– తాండూరులో మార్పుపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కన్నేసి స్థలాన్ని కబ్జా చేయాలని చూసిన యత్నానికి కళ్లెం పడింది. ఆక్రమణకు గురైన వ్యాపారి స్థలం తిరిగి ఆయన సొంతం అయ్యింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో మొదలైన మార్పుపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నెహ్రు గంజ్‌కు చెందిన వ్యాపారి కట్కం వీరేందర్‌కు హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో కొంత స్థలం ఉంది. గత కొన్ని నెలల క్రితం కొందరు అక్రమార్కులు ఈ స్థలాన్ని కబ్జా చేసిన విషయం తెలిసిందే.

చాలా రోజుల పోరాటం తరువాత ఈ స్థలం కబ్కం వీరేందర్‌దే అని గుర్తించబడింది. దీంతో బుధవారం తాండూరు నెహ్రు గంజ్ వ్యాపారులు, ప్రజలు అంతా స్థలం వద్దకు చేరుకున్నారు. అక్రమణకు గురైన ఫ్లాట్‌లో అన్ని తొలగించి కట్కం వీరేందర్ సొంతం చేసుకున్నారు. ఈ పరిణామం తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలల నుంచి కబ్జాల పర్వం కొనసాగుతున్నా ఎవ్వరు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపించాయి. తాజా పరిణామంతో ప్రజలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

ఉద్యమ కారులకు ఊరట..!