ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శ
– మృతుల కుటుంబాలకు మనోధైర్యం
– నేతలను పలకరించిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతుల కుటుంబ సభ్యులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. తాండూరుకు చెందిన సయ్యద్ మంజూర్ పాషా గారి అన్న సయ్యద్ అన్వర్ పాషా స్వర్గస్తులయ్యారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పట్టణంలోని మూర్షద్ దర్గా దగ్గర ఉన్న వారి నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.
ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ ధారాసింగ్, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, తాటికొండ పరిమల్ గుప్త, మున్సిపల్ కౌన్సిలర్ మన్నపురం రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జూబైర్ లాల, అబ్దుల్ ఖవి, నాయకులు బీదర్ రాజశేఖర్, బిడ్కర్ రఘు, సిద్ధూ పంతులు, ఫజల్, గఫుర్ పాషా, ఖయ్యుమ్ అత్తర్, అదాం ఖాన్, షుకూర్ ఖాన్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

