విస్తృత సభ్యత్వ నమోదే బీజేపీ లక్ష్యం
– విజయవంతానికి అందరు కృషి చేయాలి
– మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు
– తాండూరులో ఉత్సహాంగా బీజేపీ సభ్యత్వ నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విస్తృత సభ్యత్వ నమోదే లక్ష్యంగా బీజేపీ నేతలు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నర్సింలు అన్నారు. గురువారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 28లోని 151బూతులో బూత్ అధ్యక్షులు సంగేశ్వర్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి సభ్యత్వ నమోదును నాగారం నర్సింలుకు అందజేశారు. ఈ సందర్భంగా నాగారం నర్సింలుతో పాటు పలువురు మాట్లాడుతూ దేశంలో అధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీగా బీజేపీ బలంగా ఉందన్నారు.
ఈ సారి కూడా విస్తృత సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. గడప గడపకు వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరు భాగస్వాములై సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, కార్యదర్శి అంతారం కిరణ్, ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, మంతటి రాజు, మైనార్టీ అధ్యక్షులు షాబూద్దీన్, కోశాధికారి ప్రహల్లాద్ జాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

