కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం
– త్వరలో అర్హులైన వారికి ఇండ్లు
– ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేరుస్తాం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ వాష్ పనులు
– అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ పనుల ప్రారంభంతో పాటు రూ. 20లక్షలతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇందిరమ్మ, రాజీవ్ కాలనీల అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. ఇండ్లకు సున్నాలు కూడా వేయించలేదని అన్నారు.

ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కాలనీలోని ఇండ్లకు వైట్ వాష్ వేయిస్తున్నామన్నారు. అదేవిధంగా కాలనీలో రూ. 20లక్షలతో సైడ్ డ్రైన్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే అర్హు లైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిలను బాధ్యతగా నెరవేరుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, నాయకులు వడ్డె శ్రీనివాస్, జిలాని, నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

వార్డు సమస్యల పరిష్కారానికి చర్యలు