రోడ్డుపై జులుం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డుపై జులుం..!
– దర్జాగా డబ్బా ఏర్పాటు
– చిరు వ్యాపారులపై దౌర్జన్యం
– బల్దియా ఉద్యోగిని అంటూ బెదిరింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బల్దియా ఉద్యోగిని అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. రోడ్డుపై దౌర్జన్యంగా డబ్బా ఏర్పాటుకు సహకరించాడు. అభ్యంతరం తెలిపిన చిరు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న రోడ్లపై కూరగాయల వ్యాపారులు విక్రయాలు చేపడుతూ జీవనం సాగిస్తున్నారు.

రోడ్డుపై అక్రమంగా వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ వారికి సహకరిస్తున్నారు. అయితే మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న గోడ వద్ద రోడ్డుపై కొందరు వ్యాపారులు డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మున్సిపల్ గోడ వద్ద టిఫిన్ సెంటర్ పేరుతో ఓ డబ్బాను ఏర్పాటు చేశారు. ఈ డబ్బా ఏర్పాటును స్థానిక చిరు వ్యాపారులు అభ్యంతరం తెలిపితే.. ఓ వ్యక్తి నేను మున్సిపల్ ఉద్యోగిని ఎక్కువ మాట్లాడితే కూరగాయాలన్నీ ఎత్తుకెళ్లి పోతానని, ఇక్కడ వ్యాపారం చేసుకోకుండా చేస్తానని బెధిరించినట్లు వ్యాపారులు వాపోయారు.

రోడ్డుపై వ్యాపారాల సంగతి ఎలా ఉన్నా మున్సిపల్ ముందే డబ్బాలతో ఆక్రమణలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో అందరు రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..!