ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రం శానిటైజేష‌న్

కెరీర్ తాండూరు

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రం శానిటైజేష‌న్
– హైపోక్లోరైట్ పిచికారి చేసిన మున్సిప‌ల్ సిబ్బంది
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఈనెల 25 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ప్రారంభమ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ను ప‌రీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు కోవిడ్ నిబంధ‌న‌ల అమ‌లులో భాగంగా మున్సిప‌ల్ సిబ్బంది ఈ ప‌రీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేశారు. క‌ళాశాల‌లోని అన్ని గ‌దుల్లో హైపోక్లోరైట్ మందును పిచికారి చేయించారు. ఈ సంద‌ర్భంగా సెంట‌ర్ నిర్వ‌హ‌కులు మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ప‌రీక్షా కేంద్రంలో శానిటైజ్ చేయించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ జ‌వాన్ శ్రీ‌ను, సిబ్బంది ఉన్నారు.