మహాలక్ష్మీ పథకం వరం
– గ్యాస్ సబ్సిడీసీ సద్వినియోగం చేసుకోవాలి
– గుర్తింపు పత్రాలు అందజేసిన కౌన్సిలర్ బొంబీనా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం మహిళలకు వరంలాంటిదని తాండూరు మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా అన్నారు. మంగళవారం ఆమె తన వార్డులో మున్సిపల్ నుంచి మహాలక్ష్మీ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బొంబీనా లబ్దిదారులకు పత్రాలను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ కింద ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు గ్యాస్ సిలిండర్ మీద రూ.500ల సబ్సీడీనీ పొందేందుకు గుర్తింపు పత్రాలను కూడా అందిస్తుందని అన్నారు. త్వరలోనే రూ.2500లు అందజేస్తుందని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ కళ్యాణి, కార్తిక్, ఫాతిమా, శివలీల తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

