మందుబాబులకు షాక్..!
– ఒకరికి జైలు, మరో 9మందికి జరిమాన
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు తాండూరు న్యాయస్థానం జరిమాన, జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించి తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో 10 మంది వాహనదారులు దొరికిపోయారు. దీంతో పట్టణ పోలీస్టేషన్‌లో వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
గురువారం తాండూరు సెకండ్ క్లాస్ జ్యూడిషీయల్ న్యాయమూర్తి నామాల అశోక్ కేసు వివరాలను పరిశీలించి నిందితుల్లోని పాత తాండూరకు చెందిన రాజేందర్ అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష, అదేవిధంగా 7గురికి ఒక్కోక్కరికి రూ. 1000ల చొప్పున, మరో ఇద్దరికి రూ. 2వేల చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

