పేదల ఆరోగ్యాన్ని ప్రాధాన్యం
– త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సీఎంఆర్ఎస్ లబ్దిదారులకు ఎల్ఓసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, బషీరాబాద్ మండలాలకు చెందిన 54 మందికి సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.18లక్షల 40 వేల చెక్కులు ఎల్ఓసీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తుందన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులలో కార్పోరేట్ వైద్యం పొందేందుకు తొ డ్పాటు అందిస్తుందన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో సుద్ద, బండల కర్మాగారం, మున్సిపల్, పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల కోసం తాండూరులో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే తాండూరులోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, అజయ్ ప్రసాద్, రాందాస్, పండరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

