ఒకే ఒక్కడు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఒకే ఒక్కడు..!
– ఆ ఒక్క పోస్టుకు గురి
– శ్రీశైలంకు టీచర్ పోస్టు సొంతం
– కురువ ఆణిముత్యంకు అభినందనల వెల్లువ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక్క పోస్టుకు గురిపెట్టి టీచర్ పోస్టు సాధించి ఒకే ఒక్కడుగా నిలిచాడు దోమ శ్రీశైలం. ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లాకు కేటాయించిన ఒకే పోస్టును తాండూరు మండలం మారు మూల గ్రామానికి చెందిన దోమ శ్రీశైలం సాధించి శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లాకు మంజూరైన ఒకే ఒక్క పోస్టును సాధించడం పట్ల ఆయనకు అభినందనలు వెలువెత్తాయి. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో కారోబార్ గా పనిచేస్తున్న దోమ భీమయ్య కుమారుడు దోమ శ్రీశైలం కష్టపడి చదువుకున్నారు.

గతంలో తాండూరు పట్టణంలో భాష్యం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఆ తరువాత పట్టణంలోని ప్రగతి స్టడీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఎంతో మంది పేద అభ్యర్థులకు బోధన అందించారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎ స్సీలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతం ఉపాధ్యాయ పోస్టుకు సిద్ధమయ్యారు. వికారాబాద్ | జిల్లాకు కేటాయించిన ఒకే ఒక పోస్టు కోసం కష్టపడ్డారు. తాజాగా ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ లో వికారాబాద్ జిల్లాకు మంజూరైన సంస్కృత ఉపాధ్యాయుడుగా శ్రీశైలం నియామకం అయ్యారు.

తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. మరోవైపు ఒగ్గు కళాకారుల కుటుంబానికి చెందిన శ్రీశైలం ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉద్యోగం సాధించడం పట్లు కురుమ, ఒగ్గు కళాకారుల సంఘం సభ్యులు కురుల ఆణిముత్యం అంటూ అభివర్ణించి శుభకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ