పాదయాత్ర భక్తుల సేవలో…!
– అన్నప్రసాద పంపిణీ చేసిన హిందూ ఉత్సవ సమితి
– అభినందించిన తుల్జాపూర్ పాదయాత్ర భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న తాండూరు హిందూ ఉత్సవ సమితి పాదయాత్ర భక్తుల సేవలతో తరించింది. తాండూరు మీదుగా తుల్జాపూర్కు పాదయాత్ర కోసం రైళ్లో వెళుతున్న భక్తులకు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మధ్యాహ్నం కోణార్క్ ఎక్స్ ప్రెస్, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, హుసేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో వెళ్లే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
తాండూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదంను వితరణ చేశారు. హిందూ ఉత్సవ సమితి చేపట్టిన సేవా కార్యక్రమాన్ని తుల్జాపూర్ పాద యాత్ర భక్తులు అభినందించి.. కొనియాడారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణతో పాటు హిందూ ఉత్సవ సమితి ధర్మ సేవకు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, సమితి సభ్యులు కౌన్సిలర్ రాము, ఎర్రం శ్రీధర్, పర్యాద రామకృష్ణ, మంత్ గౌడ్ అశోక్, పరమేష్, సందీఫ్ రెడ్డి, రజక నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

