కాగ్నా నుంచి ఇసుక రవాణా..!
– ట్రాక్టర్‌ను సీజ్ చేసిన పోలీసులు
– వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేసి, వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. పాత తాండూరుకు చెందిన కుద్దుల రమేష్ అనే వ్యక్తి తాండూరు శివారులోని కాగ్నానది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎరైవనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేసి.. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…


