మైనర్లకు బైకులు ఇవ్వొద్దు..!
– పద్దతి మారకపోతే కేసులు తప్పవు
– కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన
– యజమాన్యంకు హెచ్చరించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కళాశాలకు వెళ్లే మైనర్ విద్యార్థులకు బైకులు, స్కూటీలు ఇవ్వరాదని వారి తల్లిదండ్రులకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా పూడూరులో జరిగిన ఆర్టీసీ బస్సు, బైకు ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని శనివారం తాండూరు పట్టణంలో మైనర్లు బైకుల వాడకంపై తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో పట్టణంలోని సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉన్న భాష్యం జూనియర్ కళాశాల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో 25 మోటారు సైకిళ్లను గుర్తించి పోలీస్టేషన్‌కు తరలించారు.
విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్టేషన్‌కు పిలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్లకు మోటారు సైకిళ్లను ఇవ్వడం చట్టరిత్యా నేరమన్నారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలను నడపరాదన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు బైకులను ఇవ్వరాదన్నారు. అదేవిధంగా కళాశాలల యజమాన్యం కూడా మైనర్లు మోటారు సైకిళ్లు వాడకుండా దృష్టిసారించాలన్నారు. పద్దతి మారకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులకు, కాలేజీ యజమాన్యాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

