అమ్మాయిల రక్షణే షీ టీం లక్ష్యం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అమ్మాయిల రక్షణే షీ టీం లక్ష్యం
– అపదలో సేవలను వినియోగించుకోవాలి
– టీ సేఫ్, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మాయిల రక్షణే లక్ష్యంగా షీ టీం వ్యవస్థ పనిచేస్తోందని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు షీ టీంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. అమ్మాయిలు, మహిళలు ఆపదలో ఉన్న సమయంలో వారిని కాపాడేందుకు షీ టీం పనిచె స్తుందన్నారు.

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు గాని, ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు గాని తెలిస్తే వెంటనే డయల్ 100, లేదా 181 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. వెంటనే షీ టీం, లేదా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తారని తెలిపారు. అదేవిధంగా టీ సేప్ యాప్ ను కూడా రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు మహిళలు, అమ్మాయిలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఇంచార్జ్ శేఖర్, ప్రిన్సిపల్ శివగీత, కళాజాత బృందం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత