ఎమ్మెల్యే కృషితోనే రోడ్ల అభివృద్ధి
– తాండూరు రోడ్లకు మహర్దశ ఘనత ఆయనదే
– గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదు
– అభివృద్ధిపై లైబ్రరీ మాజీ చైర్మన్ ‘కారు’ కూతలు
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– తాండూరు గౌతాపూర్ రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు రూరల్, దర్శని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి జరుగుతోందని మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం సెంట్ మార్క్స్ హై స్కూల్ సమీపం నుంచి గౌతాపూర్ వరకు 700మీటర్ల మేర చేపడుతున్న రోడ్డు పనులను చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కరణ్ కోట్ బషీరాబాద్ మార్గంలో 12 కిలో మీటర్ల రోడ్డుకు రూ.30కోట్లు, రూ. 35 కోట్లతో తాండూరు చించొల్లి మార్గంలో ఫోర్ వే లైన్, మైనర్ బ్రిడ్జి పనులు. తాండూరు వికారాబాద్ రోడ్డు పనులకు రూ.101 కోట్లు, సీపీఆర్ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంత రోడ్లకు నిధులు సాధించారని వెల్లడించారు.
వారంలో 4రోజలు తాండూరులో, 3 రోజలు హైదరాబాద్లో ఉంటూ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చె స్తున్నారని అన్నారు. వచ్చే రెండేళ్లలో తాండూరు రూపు రేఖలు మార్చడం ఖాయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాడావుడి ప్రొసిడింగ్స్ తీసుకవచ్చి శంకుస్థాపనలు చేస్తే.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అలాంటి హడావుడికి పోకుండా రోడ్లను ప్రారంభోత్సవానికి కృషి చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందన్నారు. ఇక్కడున్న లైబ్రరీ మాజీ చైర్మన్ రాజు ‘గౌడ్ కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ను ఎటుకాకుండా చేసి అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారని అన్నారు.
90శాతం బైపాస్ రోడ్డు పూర్తయ్యిందని చెప్పడంలో అర్థం లేదన్నారు. చెంగోలో, యాలాల మండలం బషీర్ మీయా తండా, రసూల్ పూర్ పరిధిలోని బాధితులకు ఇంకార పరిహారం అందించలేదన్నారు. దీంతో 90శాతం ఎక్కడ పూర్తయ్యిందని చెప్పాలన్నారు. ఆయన సోదరుని సతీమణి కౌన్సిలర్ గా వార్డులో గతంలో మంజూరు చేసిన రూ. 1 కోటి నిధులు పనులు పూర్తి అయినట్లు చూపిస్తే అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, మార్కెట్ కమిటి డైరెక్టర్లు జర్నప్ప, ఉదయ భాస్కర్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, నేతలు రాంచంద్రారెడ్డి, మల్ రెడ్డి, జగదీష్, ప్రవీణ్, కొంపల్లి శ్రీనివాస్, హరికృష్ణ, అస్మత్, బాలవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

