బీఎస్ఎన్ఎల్ మెంబర్‌గాగాజుల శాంతుకుమార్

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఎస్ఎన్ఎల్ మెంబర్‌గాగాజుల శాంతుకుమార్
– సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఎస్ఎస్ఎల్ మెంబర్ గా తాండూరుకు చెందిన బీజేపీ సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్ నియామకం అయ్యారు. శనివారం తాండూరు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. గాజుల శాంతుకుమార్ ను కలిసి శాలువాతో సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజుల శాంతుకుమార్ విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ నాయకుడుగా, ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తగా పనిచేస్తూ బీజేపీ నాయకుడుగా ఎదిగారాని అన్నారు.

పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని, రాష్ట్ర పార్టీ గుర్తించి ఆయనకు బీఎస్ఎన్ఎల్ మెంబర్ గా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదించడం జరిగిందన్నాఉ. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గాజుల శాంతుకుమార్ కు మెంబర్ అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఓటర్లుగా నమోదు యువత బాధ్యత