భద్రేశ్వరాలయంలో కార్తీక శొభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరాలయంలో కార్తీక శొభ..!
– పశుపతినాథ్‌గా దర్శనమిచ్చిన శివుడు
– దర్శించుకున్న పట్టణ భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భావిగి భద్రేశ్వర దేవాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి సొమవారం సందర్బంగా ఆలయంలో వెలసిన శివునికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి శివున్ని ఖాట్మండ్ రాజధాని నేపాల్‌లో వెలసిన శ్రీ పశుపతినాథ్‌గా అలంకరణ చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శివున్ని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలగించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇదికూడా చదవండి…

వైభవంగా లక్ష్మీపూజ..!