వైభవంగా లక్ష్మీపూజ..!
– మున్సిపల్లో సంబరాలు
– పాల్గొన్న చైర్ పర్సన్, కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వైభవంగా లక్ష్మీపూజ నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతి యేడాది మున్సిపల్ కార్యాలయంలో లక్ష్మీపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో లక్ష్మీపూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహరెడ్డి, కౌన్సిలర్లతో కలిసి లక్ష్మీపూజ నిర్వహించారు. లక్ష్మీపూజ సందర్భంగా కార్యాలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

