ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం హైదరాబాద్

ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..!
– ఈ స్కీంకు ఎలాంటి షురూటీ లేకుండా లోన్
– వెనుకబడిన కుటుంబాలకు ఉపయోగం
దర్శిని డెస్క్ : ప్రతినెల 300ల యూనిట్లు కరెంటూ ఫ్రీగా అందించే పథకం మన దేశంలో అమలు అవుతోంది. ఈ పథకం దేశంలోని వెనుకబడిన కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో స్కీంలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి కేంద్రం సూర్య ఘర్ యోజన పథకం. ఈ పథకం సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. ఈ స్కీమ్ కింద ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే వారు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా వాడుకోవచ్చు. మిగులు విద్యుత్‌ను అమ్ముకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఎంత విద్యుత్ అవసరమో అంచనా వేసుకుని, దానికి తగిన కరెంట్ ఫ్రీగా అందుకోవచ్చు.

ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులు మాఫీ చేసే పథకాలను ప్రవేశపెట్టాయి. దీంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది. తెలంగాణ, కర్ణాటక అలాంటి కొన్ని రాష్ట్రాల్లో నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాలు అమలవుతున్నాయి. ఇది ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు అనవసరంగా ఎక్కువ కరెంటు ఖర్చు చేయకుండా ఆపుతుంది.

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం భారీగా పెరిగింది. దీంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ తీర్చడానికి సూర్య ఘర్ యోజన పథకం ఉపయోగకరంగా ఉంటుంది. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో 40శాతం సబ్సిడీ ఇస్తే.. ఇప్పుడు దానిని 60శాతానికి పెంచారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడానికి బ్యాంకుల నుంచి ఎలాంటి పూచికత్తు, తనఖా లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం వివరాలు రాష్ట్రం ప్రకారం మారే అవకాశం ఉంది. కాబట్టి సంబంధించిన సమాచారం కోసం విద్యుత్ శాఖను సంప్రదించాలి. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఇందులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

ఇంతకుముందు ప్రజల ఇళ్లలో ఉన్న పాత విద్యుత్ మీటర్ల స్థానంలో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగాన్ని చాలా సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్లే ఇప్పుడు విద్యుత్ కోసం కూడా ముందుగా డబ్బు చెల్లించాలి. అంటే ఎంత డబ్బు చెల్లించామో అంత విద్యుత్ మాత్రమే వాడవచ్చు. ప్రీపెయిడ్ సిస్టమ్ వల్ల విద్యుత్‌ను వృథా చేయకుండా జాగ్రత్తగా వాడటం అలవాటు అవుతుంది.

ఈ స్మార్ట్ మీటర్లు తారుమారు చేయడం చాలా కష్టం. అంటే కన్జ్యూమర్ల విద్యుత్ బిల్లుల్లో ఎలాంటి తప్పులు జరగవు. ఇంట్లో లేని రోజుల్లో కరెంటు చాలామంది వాడరు. వారి స్మార్ట్ మీటర్ వాడుతుంటే ఆ సమయంలో విద్యుత్ బిల్లు రాదు. ఇవి విద్యుత్ కంపెనీలకు కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. ఎందుకంటే, ఈ మీటర్ల వల్ల విద్యుత్ దొంగతనం తగ్గుతుంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు ఈ స్మార్ట్ మీటర్లనే వాడుతున్నారు.

ఇదికూడా చదవండి…

సర్వే ప్రశ్నలు చేంజ్..!