ఉత్సహాంగా పూర్వ విద్యార్థినిల సమ్మేళనం
– సంతోషంగా గడిపిన కన్యా పాఠశాల విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కన్యా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థినిలు ఆత్మీయ సమ్మేళనాన్ని ఉత్సహాంగా జరుపుకున్నారు. ఆదివారం పూర్వ విద్యార్థినిలు గాజుల మాధవి, గాండ్ల ఉమా భారతిల ఆధ్వర్యంలో 2001-02 బ్యాచుకు చెందిన పూర్వ విద్యార్థినిలు ఒకే చోట కలుసుకున్నారు. అప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయురాళ్లు సత్యమ్మ, మాధురి, జ్యోతిలను ఘనంగా సన్మానించారు. చదువు కున్న రోజుల నాటి జ్ఞాపకాలను, అలర్లను, సాధించిన ఘనతలను నెమరువేసుకున్నారు. తమ తోటి విద్యార్థినులను కలుసుకుని ప్రస్తుతం ఉన్న స్థాయి, వృత్తి సంగతలను తెలుసుకున్నారు. ఉదయం నుంచి ఆత్మీయ సమ్మేళనం పదండగా.. ఉత్సహాంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పూర్వ వి ద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

