తాండూరుకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్
– ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిన్షియల్ స్కూలును మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఇదివరకే ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను మంజూరు చేయగా రెండో విడతలో తాండూరు నియోజకవర్గంకు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పేదల విద్యకు ప్రాధాన్యమిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. వెనుక ప్రాంతంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ ఏర్పాటు వల్ల పేదల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి….

