ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..!
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా పట్టణంలో చెత్త వేసే పలు బహిరంగా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. బహిరంగ స్థలంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ రంగవళ్లులతో ముగ్గు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి సంక్షేమం, అభవృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఏడాది పాలనలో పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజా పాలనలో అందరికి ఫలాలు దక్కుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయరవి, భీంసింగ్, మున్సిపల్ మేనేజేర్ నరేందర్ రెడ్డి, వార్డు ఆఫీసర్లు యాదగిరి, రవీందర్, సంగవె శ్వర్, ఇంచార్జ్ ఆర్ అశోక్ కుమార్, ఈఈ ప్రవీణ్, జవాన్లు తిరుపతి, బాలు, ఆర్పీలు పాల్గొన్నారు. మరొ వైపు పట్టణంలోని పలు వార్డుల్లో కూడా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా వార్డుల్లో ర్యాలీలు నిర్వహిస్తూ పలు అంశాలపై అవగాహాన కల్పించారు.
ఇదికూడా చదవండి…

