పురుగుల అన్నం పెడతారా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పురుగుల అన్నం పెడతారా..!
– మధ్యాహ్న భోజనంపై తాండూరు ఎమ్మెల్యే ఫైర్
– కరణ్‌కోట్ స్కూల్ ఏజెన్సీకి వార్నింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు పురుగుల అన్నం పెడాతారా అంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహకులకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌ను తనిఖీ చేశారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట గది, పాత్రల వినియోగాన్ని పరిశీలించారు. అప్పటికే విద్యార్థుల కోసం సిద్దం చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వండిన అన్నంలో పురుగులు ఉండడాన్ని గమనించారు. వెంటనే ఏజెన్సీ నిర్వహకులు, వంట వారిని పురుగుల అన్నం ఎలా వండారు.. అదే విద్యార్థులకు వడ్డిస్తారా అంటూ మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని.. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు. అయితే రేషన్ బియ్యం సరిగ్గారాలేదని, నాసిరకంగా వచ్చాయని తెలిపారు. మంచి బియ్యం ఇప్పించాలని కోరారు. ఇంకోసారి ఇలా జరుగకుండా చూస్తామని బదులిచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య