రికార్డు స్థాయిలో కందుల కొనుగోళ్లు..!
– తాండూరు మార్కెట్‌కు కాసుల వర్షం
– ఒక్కరోజే రూ. 2 కోట్ల విలువైన అమ్మకాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు కందులకు దేశవ్యాప్తంగా పేరుంది. తాండూరు కందికి జీఐ బ్రాండ్ గుర్తింపు కూడా ఉంది. ప్రతి సీజన్లో తాండూరు మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లు జరుగుతాయి. తాండూరు మార్కెట్ యార్డుకు కందుల విక్రయాలే లాభాలు తెస్తాయి. ఈ సారి కూడా మార్కెట్లో కందుల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. గురువారం జరిగిన క్రయ విక్రయాల్లో ఒక్కరోజే రూ. 2.07 కోట్ల కందుల అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ కమిటి అధికారులు ప్రకటించారు.
2వేల 88 క్వింటాళ్ల కందులను విక్రయించినట్లు వెల్లడించారు. క్వింటాళ్ కందులు గరిష్టంగా రూ.10,059, కనిష్టంగా రూ. 8,800, సగటున రూ. 9,945లకు అమ్మకాలు జరిగాయని తెలిపారు. బిడ్డింగ్‌లో వ్యాపారులు కొనుగోలు చేసుకున్నారు. మంచి లాభాలను చూసుకుని మధ్యప్రదేశ్, చత్తీష్ గడ్, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మార్కెట్ యార్డులో కందుల విక్రయాలు రికార్డు స్థాయిలో జరగడం పట్ల రైతులు, వ్యాపారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

