చట్టంతో మానవ హక్కుల సంరక్షణ
– ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
– లీగల్ సర్వీస్ కమిటి ఆధ్వర్యంలో ఆవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : చట్టంతో అందరికి ఉన్న మానవ హక్కులను సంరక్షించుకోవచ్చని తాండూరు న్యాయస్థానం లీగల్ సర్వీస్ కమిటి ప్యానల్ న్యాయవాదులు అన్నారు. మంగళవారం తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్పేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా లీగల్ సర్వీస్ కమిటి ప్యానెల్ న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతి యేడాది డిసెంబర్ 10వ తేదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.
ఈ యేడాది గౌరవం, స్వేచ్ఛ, న్యాయం అనే నినాదంతో జరుపుకుంటున్నామని తెలిపారు. పౌరులకు ఉన్న ఆరు హక్కులలో భంగం కలిగినప్పుడు న్యాయస్థాన ద్వారా, మానవ హక్కుల కమీషన్ ద్వారా వాటిని కాపాడుకోవచ్చన్నారు. ఎవరైనా హక్కులకు భంగం కలిగిస్తే రాజ్యాంగం ద్వారా న్యాయస్థానంను ఆశ్రయించి న్యాయంతో పాటు పరిహారం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ ఫ్యానల్ న్యాయవాదులు జిలాని, మస్తాన్, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, అరుణ, ప్రేమ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ సరస్వతి, వైస్ ప్రిన్సిపల్ వినయ కుమారి, ఉపాద్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

