స్కాలర్‌షిఫ్, ఫీజురియంబర్స్ మెంట్ విడుదల చేయాలి
– తాండూరు బీసీ సంఘం నేతల డిమాండ్
– సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిలో వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెండింగ్లో ఉన్న స్కాలర్ షిఫ్, ఫీజురియంబర్స్ మెంట్ వెంటనే విద్యార్థులకు విడుదల చేయాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు, జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆదేశాలతో మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని చేపట్టారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్, మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్ షిఫ్, ఫీజురియంబర్స్ మెంట్ చెల్లించడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నాని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు నరేందర్, శ్రావణ్, బసంత్, విద్యావంతులు పర్యాద రామకృష్ణ, మహిళ ఉపాధ్యక్ష, కార్యదర్శులు అనిత, నర్సమ్మ, విజయలక్ష్మీ, మజుల, మీడియా ఇంచార్జ్ బస్వరాజు, యువనాయకులు రాము ముదిరాజ్, శివకుమార్, గిరిజాపూర్ రమేష్, మంతటి రాజు, తాండ్ర నరేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

